నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్నారు, ఈ సినిమా ఇప్పటికే షూటింగులో ఉంది, ఇక దీని తర్వాత ఆయన ఏ సినిమా చేయనున్నారు అనేదానిపై ఎలాంటి క్లారిటీ లేదు.. అయితే బాలయ్య పలువురు దర్శకులు చెప్పే కథలు వింటున్నారు. కానీ ఇంకా ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అని తెలుస్తోంది.
సంక్రాంతి తర్వాత తన తదుపరి సినిమా అనౌన్స్ చేసే అవకాశం ఉంది.. తాజాగా టాలీవుడ్ లో ఓ వార్త వినిపిస్తోంది.. బాలకృష్ణ కోసం మాస్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని ఓ సబ్జెక్టును తయారుచేసినట్టు సమాచారం. ఈ స్టోరీ ఇప్పటికే బాలయ్య బాబుకు వినిపించారు అని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ చిత్రం కూడా బాలయ్య బాబు లైన్ లో పెట్టే అవకాశం ఉంది అంటున్నారు చాలా మంది.. మరీ ముఖ్యంగా బాలయ్య బాబు ఈ సినిమా స్టోరీ కొత్తగా ఉండటంతో చేయడానికి ఇంట్రస్ట్ చూపించారు అని వార్తలు వినిపిస్తున్నాయి.