ప్రస్తుతం టాలీవుడ్ లో పూజా హెగ్దె స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది… వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీ అయింది ఈ ముద్దుగుమ్మ… మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ డార్లింగ్ ప్రభాస్ తో కలిసి రాధేశ్యామ్ చిత్రంలో నటిస్తోంది పూజ… ఈ చిత్రంలో నటిస్తూనే మరో వైపు బాలీవుడ్ లో రెండు చిత్రాలు చేస్తోంది…
స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందుతున్న కభీఈద్ దివాలి సినిమాలో అలాగే రణ్ వీర్ సింగ్ హీరోగా తెరకెక్కుతున్న సర్కస్ చిత్రంలో కూడా నటిస్తోంది పూజా హెగ్దె… ఇలా రెండు భాషల్లో నటించడంపై స్పందించి ఈ చిన్నది…
తనకు రెండు భాషల్లో నటించడం సంతోషంగా ఉందని చెప్పింది… తెలుగు ప్రేక్షకులు తన మీద మొదటి నుంచి ప్రేమాభిమానాలు చూపుతున్నారని తెలిపింది… అలాగే తాను చిన్నతనం నుంచి హిందీ చిత్రాలు చూస్తూ పెరిగానని చెప్పింది… తాను ఆర్టిస్టును కాబట్టి ఒక ప్రాంతానికి పరిమితం కాకూడదని చెప్పింది… తన వరకు ఒక భాష నటిగా అనిపించుకోవడం కంటే భారతీయ నటిగా పిలిపించుకోవడమే తనకు ఇష్టం అని చెప్పింది…