తెలుగు బుల్లితెరపై దూసుకుపోతన్న రియాల్టీ షో అంటే బిగ్ బాస్ అనే చెప్పాలి, ఇప్పుడు నాల్గో సీజన్ ఫైనల్ కు వచ్చేసింది, ఇక కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది ఫైనల్ విన్నర్ ఎవరో తెలియడానికి, ఆదివారం ఫైనల్ విన్నర్ ప్రకటన వస్తుంది, ముఖ్యంగా పదిహేను వారాలు పదహారుమంది ఇంటిసభ్యులు, సరికొత్త టాస్కులతో చివరకు ఆటఆడి ఫైనల్ కు ఐదుగురు వెళ్లారు.
మరి ఈసారి విజేతను ఎవరు ప్రకటిస్తారు ట్రోపీ ఎవరు అందిస్తారు అనేదానిపై అందరూ ఒకటే చర్చ.. సోషల్ మీడియాలో కూడా అనేక పేర్లు వినిపించాయి, ఎవరు ఫైనల్‌కు చీఫ్ గెస్ట్‌గా వస్తారు అనేది, అయితే ఎన్టీఆర్, బన్నీ చరణ్, మహేష్, విజయ్ దేవరకొండ పేర్లు వినిపించాయి.
కాని తాజాగా ఇప్పుడు మరో పేరు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది, చీఫ్ గెస్ట్‌గా నాగార్జునతో వేదికను పంచుకొని షోలో విజేతను ప్రకటించేందుకు మెగాస్టార్ సిద్దంగా ఉన్నారట. ఈ సీజన్ విజేతను ప్రకటించనుంది మెగాస్టార్ చిరంజీవి అని వార్తలు వినిపిస్తున్నాయి. ఆదివారం ఫైనల్ అంటే శనివారం షూట్ జరుగుతుంది.. సో ఈ శనివారం ఫైనల్ గా ఎవరో అందరికి తేలిపోనుంది అంటున్నారు బిగ్ బాస్ అభిమానులు. మీ అభిప్రాయం విన్నర్ ఎవరో కామెంట్ చేయండి.