ఇటీవల మనం కొన్ని వార్తలు వింటున్నాం కొందరు హోటల్స్ కు వెళ్లిన సమయంలో బిల్ ఎంత అయిందో దానిని పే చేస్తునే, ఇక టిప్ వేల డాలర్లు ఇస్తున్నారు, వెయిటర్లని లక్షాదికారులని చేస్తున్నారు, ఇలాంటివి ఇటీవల బ్రిటన్ అమెరికాలో చాలా చూశాం, అయితే తాజాగా ఇలాంటి ఘటన మరోకటి జరిగింది, దీని గురించి అందరూ చర్చించుకుంటున్నారు.
పెన్సిల్వేనియోలో ఆంథోనీస్ ఎట్ పాక్సన్ హాలో అనే రెస్టారెంటు ఉంది. జియానా డి ఏంజెలో అనే అమ్మాయి ఈ రెస్టారెంటులో పార్ట్ టైమ్ వెయిట్రెస్ గా ఉద్యోగం చేస్తోంది. ఇక్కడ చదువుకుంటూ పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తోంది, అయితే కాలేజీ ఫీజుల కోసం ఇలా పని చేస్తోంది ఆమె.
ఓరోజు పాక్సన్ హాలో రెస్టారెంటుకు ఓ మహిళ వచ్చింది. తనకు నచ్చినవన్నీ ఆర్డర్ ఇచ్చి ఎంచక్కా భోంచేసింది.
ఇక బిల్లు 205 డాలర్లు అయింది, అయితే ఆ మహిళ జియానా కి ఏకంగా 5 వేల డాలర్ల టిప్పు ఇచ్చింది… మన మన కరెన్సీలో 3.67 లక్షలు ఇచ్చింది, దీంతో ఆమె ఎంతో సంతోషించింది. ఆమె ఈ టిప్పు తీసుకుని కాలేజీ ఫీజు కడతాను అని తెలిపింది కొంత తన దగ్గర ఉంచుకుంటాను అని తెలిపింది.