తమిళ బుల్లితెర నటి వీజే చిత్ర ఆత్మహత్య కేసులో దర్యాప్తు జరుగుతోంది , భర్త అన్న మాటలకు ఆమె ఆత్మహత్య చేసుకుంది అని తెలుస్తోంది, అయితే ఆమె భర్త హేమంత్ ని పోలీసులు అన్నీ కోణాల్లో విచారణ చేశారు, ఈ నెల 9వ తేదీన చెన్నై నజరత్పేట్టైలోని ఓ హోటల్లో చిత్ర ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
చిత్ర క్యారెక్టర్పై అనుమానం పెంచుకున్న హేమంత్ ఆమెను తరుచూ వేధింపులకు గురిచేసేవాడని విచారణలో వెల్లడైంది.
ముఖ్యంగా ఆరోజు రాత్రి ఆమె షూటింగ్ లో ఉంది, ఈ సమయంలో సహ నటుడితో కాస్త చనువుగా ఉండే సన్నివేశంలో నటించింది, దీంతో ఆమెపై భర్త ఆగ్రహం వ్యక్తం చేశాడు, ఆమెపై అనుమానం పెంచుకుని నిందలు వేశాడు.
ఆ అవమానం తట్టుకోలేకే చిత్ర ఆత్మహత్య చేసుకుందని పోలీసులు నిర్ధారించారు. ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న ఆమె ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో చిత్ర సీమ ఒక్కసారిగా షాక్ అయింది, పొన్నేరి సబ్జైలులో ఆమె భర్త ఉన్నారు.