సంక్రాంతి పండుగ వస్తోంది ఇక నగరాల నుంచి తమ సొంత ప్రాంతాలకు వెళ్లేవారు చాలా మంది బస్సులు ట్రైన్ల కోసం చూస్తారు.. ఎప్పుడు స్పెషల్ ట్రైన్లు బస్సులు నడుపుతారా అని ఆ ప్రకటన కోసం చూస్తారు.. ఇక హైదరాబాద్ నగరం నుంచి లక్షలాది మంది తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ బస్సులకే ఎక్కువగా వెళతారు, ఈ సమయంలో ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది.
ఏపీ ఆర్టీసీ 3,607 ప్రత్యేక బస్సులు తిప్పాలని నిర్ణయించింది పండుగ సమయంలో. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చేవారి కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి వెల్లడించారు. ఇక వచ్చే నెల అంటే జనవరి 8 నుంచి ఈ బస్సు సర్వీసులు నడుస్తాయి, ఇటు ప్రధాన నగరాల నుంచి ఈ బస్సులు నడుస్తాయి . జనవరి 8 నుంచి 13 వరకూ ఈ బస్సులు నడువనున్నాయి.
హైదరాబాదుతో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుంచి 1,251 బస్సులు ఏర్పాటు చేశారు
ఇక బెంగళూరు నుంచి ఏపీకి 433
చెన్నై నుంచి 133 బస్సులు తిరుగుతాయి
విజయవాడకు 201 బస్సులు నడుస్తాయి
విశాఖపట్నం 551 బస్సులు