ఏపీలో సంక్షేమ పథకాల అమలులో వైయస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు దూసుకుపోతోంది, మొత్తానికి ఎన్నికల సమయంలో ఇచ్చిన నవరత్నాల హామీలు అన్నీ నెరవేరుస్తున్నారు, ఇక నెలకి ఓ కొత్త పథకం తో జగన్ సర్కారు పేదలకు అనేక పథకాలు తీసుకువస్తోంది, ఇక తాజాగా రేషన్ డోర్ డెలివరీ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.
2021 జనవరి అంటే వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఇంటింటికి రేషన్ అందించనుంది ఏపీ ప్రభుత్వం. రేషన్లో అందించే నాణ్యమైన బియ్యం సహా నిత్యావసరాలను ఇంటి వద్దే డెలివరీ చేయనుంది ప్రభుత్వం. ఇక రేషన్ షాపుకి వెళ్లాల్సిన పనిలేదు, ఆ అవసరం లేకుండానే నేరుగా మీ ఇంటికి డోర్ డెలివరీ చేస్తారు.
రాష్ట్రంలో దీని కోసం మొత్తం 9260 వాహానాలను సిద్దం చేసింది జగన్ ప్రభుత్వం. టాటా, సుజుకి సంస్థల ద్వారా డోర్ డెలివరీ ట్రక్కుల కొనుగోళ్లు చేసింది సర్కార్. ఇక బియ్యం కొలిచేందుకు కాటా కూడా పెడుతున్నారు,
ట్రక్కులో ఫ్యాన్, ఫైర్ ఎక్సటింగ్విషర్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అందుబాటులో ఉండనుంది. ఇక ఇందులో మైక్ కూడా ఏర్పాటు చేశారు.