గుర్రపు స్వారీ అంటే చాలా మందికి సరాదా.. ఇక ధనవంతులు అయితే తమ ఫామ్ లో గుర్రపు స్వారీ ప్లేస్ ని ఏర్పాటు చేసుకుంటారు, ప్రపంచంలో దాదాపు 120 దేశాలల్లో ఉన్న ప్రముఖులు గుర్రపు స్వారీ చేయాలి అని అభిలాష ఉన్నవారు ఒక రకం మేలు జాతి గుర్రాలని తెచ్చుకుంటారు.. అవే అరేబియన్ గుర్రాలు, ఇవి చాలా ఫేమస్ అంతేకాదు పశ్చిమ యూరప్ బ్రిటన్ కెనడా ఈ ప్రాంతాలకు వీటిని ఎక్కువగా తీసుకువెళుతూ ఉంటారు.
ధర ఎంత ఉన్నా చాలా మంది వీటిని తీసుకువెళతారు, ఇవి చాలా సన్నిహితంగా ఉంటాయి, వీటికి ఇచ్చే ట్రైనింగ్ బట్టీ ఇవి మెలుగుతూ ఉంటాయి,అరేబియా ఎడారుల్లో బ్రీడింగ్ చేసి పెంచుతారు…కొందరు చిన్నగా ఉన్న సమయంలో తీసుకువెళితే మరికొందరు ట్రైనింగ్ ఇచ్చి తీసుకువెళతారు, ఇక చాలా బలంగా ఉంటాయి గట్టి దాణా మాత్రమే ఇవి తింటాయి, ఇక ఇవీ అడ్డమైన ఫుడ్ తినవు కొంచెం తిన్నా బలమైన ఫుడ్ తింటాయి.
వాటర్ కూడా చాలా తక్కువ తీసుకుంటాయి, ఇక గుర్రం అంటేనే అందం ఇవి చూడటానికి చాలా అందంగా ఉంటాయి. వీటి ధర బ్రీడ్ సమయంలో 3 లక్షలు ఉంటుంది.. వీటిని ట్రైనింగ్ ఇచ్చి పెంచి అమ్మితే దాదాపు 8 లక్షలు ఇస్తారు.. ఒకవేళ మీరు బ్రీడ్ సమయంలో తీసుకువెళ్లి ట్రైనింగ్ కోసం తీసుకువస్తే 2 లక్షలు చార్జ్ చేస్తారు.. మూడు నెలల ట్రైనింగ్ తో ఇవి సన్నిహితంగా మారుతాయి.