తెలుగు సినిమాల్లో ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది.. ఎన్నొ మంచి చిత్రాలు చేశారు ఆయన..విలక్షణ నటుడు తిరుమల సుందర శ్రీరంగనాథ్..1949లో మద్రాసు నగరంలో టి.ఆర్.సుందరరాజన్, జానకీదేవి దంపతులకు జన్మించాడు. డిగ్రీ చదివిన ఆయన రైల్వేలో టికెట్ కలెక్టర్ గా ప్రభుత్వ ఉద్యోగం చేశారు, ఇక తెలుగు చలన చిత్ర సీమలో ఆయన 1969లో బుద్ధిమంతుడు సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు.. అక్కడ నుంచి తెలుగులో అనేక పాత్రలు నటించారు. సుమారు 300 చిత్రాల్లో చేశారు, ఇక కవి రచయితగా ఆయన మంచి నవలలు రాశారు, ఇక ఆయన పలు సీరియళ్లలో నటించారు.
ఇక ముందు నాటకాలు వేసే ఆయన తర్వాత సినిమాల్లో అవకాశం రావడంతో చిత్రాలు నటించారు, హీరోగా, విలన్ గా, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఆయన నటించారు.. భాగవతం సీరియల్ తో పాటు, శాంతినివాసం సీరియల్ లో కూడా ఆయన నటించారు.. మొగుడ్స్ పెళ్లామ్స్ సినిమాకు దర్శకత్వం వహించారు.
సుదర్శనం, అంతరంగ మథనం, ఈ చీకటి తొలగాలి, పదపరిమళం, అక్షర సాక్ష్యం, రంగనాథ్ కథలు రాశారు డిసెంబరు 19, 2015 న హైదరాబాదు లోని తన స్వగృహంలో మరణించారు ఆయన. ఆయన భార్య బాల్కనీ నుంచి ప్రమాదవశాత్తు కిందపడిపోయారు, చివరకు మంచానికి పరిమితం అయింది, ఆయనే సపర్యలు చేశారు..2009లో ఆమె కన్ను మూశారు.2015లో అర్ధాంతరంగా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు రంగనాథ్ .