ఏ కొత్త రకం వ్యాధులు గుర్తించినా ముందు కేరళలోనే వార్తలు వినిపిస్తాయి… నిఫా కరోనా ఇలా అన్నీ ఇక్కడ వెంటనే వైద్యులు గుర్తించారు. తాజాగా ఇప్పుడు మరో వ్యాధి కేరళని వణికిస్తోంది. షింగెల్లా అనే బ్యాక్టీరియా అక్కడ వ్యాపిస్తోంది. ఈ బ్యాక్టీరియాతో 2 సమస్యలున్నాయి. ఇది ప్రాణాంతకమైన వైరస్ అంతేకాదు ఇది అంటువ్యాధిలా వస్తుంది, ఎవరికి అయినా సోకితే పక్కవారికి సోకే ఛాన్స్ ఉంది.
ఒక 11 ఏళ్ల బాబు మరణించాడు, సో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ బ్యాక్టీరియా పేరు షింగెల్లా. ఇది సోకడాన్ని షింగెల్లోసిస్ అంటారు. ముందు బాడీలో ఈ వైరస్ సోకితే విరోచనాలు వాంతులు కడుపునొప్పి వస్తుంది. ఏదీ తినాలి అనిపించదు, దీనిని తగ్గించడానికి యాంటి బయోటిక్స్ వాడతారు.
చెడిపోయిన ఆహారం, కలుషిత నీరులో ఈ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఎవరికి అయినా సోకింది అంటే ముందుగా. స్టూల్ టెస్ట్ ద్వారా చెబుతారు, బాగా శుభ్రత పాటించాలి ఎక్కడపడితే అక్కడ చేయి పెట్టకూడదు, వాటిని నోటికి ముక్కుకి తగిలించకూడదు.
బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయరాదు. ఎట్టి పరిస్దితిలో నిల్వ ఉంచిన ఆహారం తినవద్దు.