మన దేశంలో ఏ స్టేట్ లో ఎన్నికలు వచ్చినా ముందు అక్కడ ఉన్న రాజకీయ పార్టీలతో పాటు ఓ వ్యక్తి పేరు వినిపిస్తుంది, ఆయన మరెవరో కాదు అందరికి తెలిసిన వ్యక్తి …దేశంలోనే ఎన్నికల వ్యూహకర్తగా కొనసాగుతున్న ప్రశాంత్ కిషోర్, ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ఆయన అందరికి బాగా తెలిసిన వ్యక్తి.
అయితే ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడానికి ఆయన కృషి కూడా ఉంది అనే చెప్పాలి. వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిశోర్, ఇప్పుడు పశ్చిమబెంగాల్ లో మమతాబెనర్జీ పార్టీ అయిన టీఎంసీకి పని చేస్తున్నారు, అక్కడ వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి, దీదీ పార్టీకి ఆయన వ్యూహాకర్తగా ఉన్నారు.
అయితే తాజాగా ఇక్కడ పొలిటికల్ హీట్ పెరిగింది, బీజేపీ అలాగే తృణముల్ కాంగ్రెస్ నేతల మధ్య వార్ నడుస్తోంది,
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 200 స్థానాలను కైవసం చేసుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు..
అమిత్ షా వ్యాఖ్యలపై ప్రశాంత్ కిశోర్ స్పందిస్తూ… బీజేపీకి దక్కే స్థానాలు రెండంకెల సంఖ్యను దాటవని అన్నారు.
అదే జరిగితే తాను ట్విట్టర్ ను వదిలేస్తానని చెప్పారు. దీంతో ఈ ట్వీట్ పొలిటికల్ హీట్ పెంచింది.