ప్రైవేటు ఉద్యోగాలు చేసే ఉద్యోగులు కొందరు కొన్ని కారణాల వల్ల ఉద్యోగాలు వదిలేస్తూ ఉంటారు, అయితే వారికి అప్పటి వరకూ వచ్చిన పీఎఫ్ తీసుకోకుండా వదిలేస్తారు. దీంతో వారి ఖాతా నాన్ ఆపరేటివ్ గా మారిపోతుంది. .కొందరు ఉద్యోగులు తమ పిఎఫ్ ఖాతా నంబర్ను మరచిపోతారు. అటువంటి పరిస్థితిలో పాత పీఎఫ్ అకౌంట్ నెంబర్ ను కనుగొని దాని నుండి డబ్బును ఉపసంహరించుకోవడం కష్టం.
గతంలో లా కాదు ఇప్పుడు మీరు ఏ సంస్ధలో చేరినా మీకంటూ ఓ పీఎఫ్ ఖాతా పర్మినెంట్ గా ఉండిపోతుంది, అదే మీరు కొత్త సంస్దలో కూడా ఇచ్చుకోవచ్చు.. దీన్ని ఆన్లైన్లో కనుగొనవచ్చు. మూడేళ్లుగా ఎటువంటి లావాదేవీలు చేయని పిఎఫ్ ఖాతాలు క్రియారహితంగా ఉన్నాయని కేటగిరీ చేస్తారు.
ముందుగా మీరు EPFO యొక్క అధికారిక వెబ్సైట్కు వెళ్లాలి.
మీ ఫిర్యాదును హెల్ప్డెస్క్ ఎంపికలో ఇవ్వాలి.
మీ పేరు, మొబైల్ నంబర్, ఐడి నంబర్, తండ్రి-భర్త పేరు, సంస్థ గురించి సమాచారం ఇవ్వాలి
దీంతో మీ ఖాతాను సులభంగా కనుగొనవచ్చు.
మీరు నగదు డ్రా చేసుకోవచ్చు