ఈ మధ్య ఫోర్ వీలర్స్ కొనుగోళ్లు బాగా పెరిగాయి, ప్రతీ కుటుంబంలో బైక్ తో పాటు కారు కూడా చాలా మంది కొనుగోలు చేస్తున్నారు, అయితే ఇప్పుడు కారు కొనుగోలు చేయాలి అని చూసేవారికి ఓ గుడ్ న్యూస్ చెబుతుంది కేంద్రం..
రానున్న రోజుల్లో సేఫ్టీ ఫీచర్లకు సంబంధించి కొత్త నిబంధనలను అమలులోకి తీసుకురానుంది.
నిపుణులు చెబుతున్న దాని ప్రకారం మన దేశంలో కార్లకు సంబంధించి సేఫ్టీ ఫీచర్లకు అధిక ప్రాధాన్యత ఉండటం లేదు. దీంతో కచ్చితంగా కంపెనీలు ఇకపై ఫీచర్లు అన్నీ ఇవ్వాల్సిందే.. దీనిపై తాజాగా హైలెవెల్ టెక్నికల్ కమిటీ ఒకటి కేంద్ర ప్రభుత్వానికి పలు సిఫార్సులు చేసింది.
కార్లలో ముందు భాగంలో డ్రైవర్ పక్కన కూర్చున్న వారికి డ్యూయెల్ ఎయిర్ బ్యాగ్స్ ఉండాలి.. డ్రైవర్ పక్కన కూర్చున్న వ్యక్తికి ఎయిర్ బ్యాగ్ పక్కాగా ఏర్పాటు చేయాలి, దీనికి కేంద్రం ఒకే చెబితే కచ్చితంగా 2 ఎయిర్ బ్యాగ్ లు కంపెనీలు ఏర్పాటు చేయాల్సిందే. ఇప్పటికే యూరప్ లో అన్నీ దేశాల్లో ఇలా కంపెనీలు ఏర్పాటు చేస్తున్నాయి.. అంతేకాదు చైల్డ్ లాక్ సిస్టమ్ను కూడా కార్లలో తప్పనిసరి చేయాలని చూస్తున్నారు.