అన్నయ్య చిరంజీవి సినిమా టైటిల్ పవన్ కల్యాణ్ తీసుకుంటున్నారా?

-

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వేగంగా సినిమాలు సైన్ చేస్తున్నారు, అంతేకాదు అన్నీ సెట్స్ పై కూడా పెడుతున్నారు, వచ్చే ఏడాది నుంచి రెండు చిత్రాలు ప్రతీ ఏడాది వచ్చేలా ప్లాన్ చేస్తున్నారనే చెప్పాలి.. వకీల్ సాబ్ ఓ పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది, అయితే తాజాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో మలయాళంలో వచ్చిన అయ్యప్పనుమ్ కోషియమ్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది.

- Advertisement -

ఇప్పుడు ఈ సినిమా తెలుగులో రీమేక్ చేయడానికి సిద్దం అయ్యారు, ఇక మలయాళంలో పృథ్వీరాజ్, బిజూమీనన్ పోషించిన ప్రధాన పాత్రలను తెలుగు వెర్షన్ లో పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి పోషిస్తున్నారు.తెలుగులో ఈ చిత్రానికి దర్శకుడిగా సాగర్ చంద్ర చేస్తున్నారు, హైదరాబాద్ లో సినిమా షూటింగ్ ప్రారంభం అయింది.

పవన్ సరసన సాయిపల్లవి, రానా సరసన ఐశ్వర్య రాజేశ్ నాయికలుగా నటించే అవకాశం వుంది. ఇక మరి ఈ సినిమా టైటిల్ ఏమిటి అనేది అప్పుడే చర్చ మొదైంది, తాజాగా పాత టైటిల్ పేరు వినిపిస్తోంది, మెగా అభిమానులు కూడా ఈ టైటిల్ బాగుంది అంటున్నారు. ఈ చిత్రానికి బిల్లా రంగా అనే పేరు బాగా వినిపిస్తోంది. చిరంజీవి, మోహన్ బాబు ప్రధాన పాత్రలు గా 1982 లో ఈ సినిమా వచ్చింది. సో చూడాలి ఇంకా దీనిపై ప్రకటన రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...