హీరోయిన్ సాయి పల్లవి సినిమా పరిశ్రమలో ఎంతో గొప్ప పేరును సంపాదించింది, మరీ ముఖ్యంగా హీరోయిన్ గా ఆమెకి ఎన్నో అవకాశాలు వస్తున్నాయి. టాప్ హీరోలతో నటించింది ఈ ముద్దుగుమ్మ, అయితే తాజాగా ఆమె ఓ విషయం పై క్లారిటీ ఇచ్చింది, గతంలో రూ.2 కోట్ల ఆఫర్‌తో వచ్చిన ఓ ఫెయిర్‌నెస్ క్రీమ్ యాడ్‌లో తాను ఎందుకు నటించలేదన్న విషయాన్ని హీరోయిన్ సాయి పల్లవి వివరించి చెప్పింది.
ఎప్పుడూ నేను సింపుల్‌గా ఉండడానికే ఇష్టపడతానని చెప్పుకొచ్చింది ఆమె. ఆ ఫెయిర్‌నెస్ క్రీమ్ యాడ్ ఆఫర్‌ను తిరస్కరించడం నా వ్యక్తిగతమైన ఆలోచన అని చెప్పింది. అందం చూసి కొందరు చులకనగా చూస్తారు ఇది నేను చాలా చోట్ల చూశాను,
ప్రేమమ్ కు ముందు తన ముఖంపై మొటిమలు తగ్గడానికి చాలా రకాల క్రీమ్స్ లను వాడానని,ఆ సమయంలోమొటిమలను మాత్రమే చూసి ఇతరులు ఎందుకు మాట్లాడుతున్నారని ఆలోచన వచ్చింది..తన కళ్లలోకి చూసి ఎందుకు మాట్లాడడం లేదని ఆలోచించాను అని తెలిపింది ఆమె.
మరోవైపు తన సోదరి తెల్లగా మారడం కోసం ఇష్టంలేని ఆహార పదార్థాలను తినేదని చెప్పింది. ఇలా ఆ యాడ్ అందుకే రిజెక్ట్ చేశాను అని తెలిపింది ఆమె.