ఇటీవల గ్రద్దలు గుడ్ల గూబలు చాలా మంది సీక్రెట్ గా అమ్మకాలు జరుపుతున్నారు, వీరి ఆటకట్టిస్తున్నారు పోలీసులు.. ఇటీవల బీహర్ యూపీలో కూడా ఇలాంటి ముఠాలు రెచ్చిపోయి గాలం వేసి వేరే జంతువులని ఎర వేసి వీటిని పట్టుకుంటున్నాయి కొన్ని ముఠాలు, ఇటీవల గుడ్లగూబలను వేల నుంచి లక్షల రూపాయలకు అమ్ముతున్నారు.
ఇటీవల నగరంలో ఓ వ్యక్తి నుంచి 15 బార్న్ గుడ్లగూబలను రక్షించారు.. వీటి ధర కూడా పదివేల నుంచి 1 లక్ష వరకూ ఉంటుంది అని తెలుస్తోంది. అయితే ఇంతలా మన దేశంలో ఈ గుడ్ల గూబలకి ఎందుకు ఇంత డిమాండ్ ..వీటిని ఎవరూ తినరు, మరి చూడటానికి భయంగా ఉంటాయి ఎందుకు ఈ ధర అంటే.
చేతబడులు, క్షుద్రపూజల కోసం బార్న్ గుడ్లగూబలను వాడతారని తెలుస్తోంది. చూశారుగా ఇంకా ఇలాంటి మూడనమ్మకాలతో వీటిని చంపేస్తూ ఇబ్బంది పెడుతున్న వారు చాలా మంది ఉన్నారు, ఇది నేరం అని పోలీసులు తెలియచేస్తున్నారు.