లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు అభిజిత్ …అయితే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో విన్నర్ అయిన తర్వాత అతనికి మరింత ఫేమ్ వచ్చింది, అంతేకాదు తెలుగు వారికి బాగా దగ్గర అయ్యాడు, ఇక బిగ్ బాస్ సీజన్ 4 ట్రోపీ గెలుచుకుని 25 లక్షల రూపాయల ఫ్రైజ్ మనీ గెలుచుకున్నాడు.
అయితే ఇప్పుడు ఇది సినిమా పరిశ్రమలో అభిజిత్ కు సెకండ్ ఇన్నింగ్స్ అనే చెబుతున్నారు, ఇప్పుడు అనేక కథలు వస్తున్నాయి, అతనికి ఇంటి ముందు నిర్మాతలు దర్శకులు క్యూ కడుతున్నారు, పలు వెబ్ సిరీస్ లు ప్లాన్ చేస్తున్నారు.
అయితే అభిజిత్ కు విన్నర్ అయినందుకు 25 లక్షల ప్రైజ్ మనీ వచ్చింది.
అంతేకాదు భారీగానే రెమ్యునరేషన్ అందుకున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి, అభిజిత్ కు దాదాపు వారానికి ఐదు లక్షల రూపాయల రెమ్యునరేషన్ తో హౌస్ లోకి తీసుకున్నారు అని వార్తలు వస్తున్నాయి… ఇలా చూసుకున్నా 25 లక్షల ప్రైజ్ మనీ అలాగే 75 లక్షలు 15 వారాల రెమ్యునరేషన్ అని అంటున్నారు, సో కోటి రూపాయల వరకూ వచ్చింది అని టాక్ నడుస్తోంది బుల్లితెర వర్గాల్లో.