క్రిస్మస్ సెలబ్రేషన్స్ ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి, ఈ పండుగ సందర్భంగా మిత్రులకి చాలా మంది గిఫ్టులు పంపించుకుంటున్నారు, ఇటు రాజకీయ సినిమా పారిశ్రామిక వర్గాల్లో చాలా మంది క్రిస్మస్ పండుగకి గిఫ్టులు పంపిస్తారు అనేది తెలిసిందే, బెస్ట్ విషెస్ చెబుతూ గ్రీటింగ్స్ పంపుతారు, అయితే తాజాగా ఓ వార్త వినిపిస్తోంది.
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఆయన అర్ధాంగి అన్నా లెజ్నెవా తమ సన్నిహితులందరికీ క్రిస్మస్ కానుకలు పంపుతున్నారు. ఇక ప్రిన్స్ మహేష్ బాబు కుటుంబానికి కూడా క్రిస్మస్ కానుకలు పంపారు, స్పెషల్ గ్రీటింగ్ చెబుతూ ఓ బాక్సును పంపించారు.
సంతోషంగా ఉండాలంటూ క్రిస్మస్ శుభ సందేశాన్ని కూడా తెలిపారు. ఈ విషయాన్ని నమ్రత స్వయంగా తెలిపారు, ఇటు పవర్ స్టార్ కుటుంబానికి నమ్రత కృతజ్ఞతలు తెలిపింది ..ఇక టాలీవుడ్ లో చాలా మంది ప్రముఖులకి పవన్ దంపతులు ఇలా గిఫ్టులు పంపారు అని వార్తలు వినిపిస్తున్నాయి.