ఈ రోజుల్లో పంచదార తింటే చేటు అని బెల్లం మాత్రమే వాడుతున్నారు చాలా మంది, ముఖ్యంగా షుగర్ పేషెంట్లు ఇదే వాడుతున్నారు.. కాని కల్తీ రాయుళ్లు ఇక్కడ కూడా అడుగు వేశారు.. బెల్లం కూడా మార్కెట్లో కల్తీ చేస్తున్నారు, సో జాగ్రత్తగా ఉండాలి అని చెబుతున్నారు వైద్యులు.
బెల్లం తీసుకుని అందులో కాల్షియం కార్బొనేట్, సోడియం బైకార్బొనేట్ వంటి రసాయనాలను కలుపుతున్నారు. అయితే ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే, బెల్లం బరువు ఎక్కుతుంది.. కాల్షియం కార్బొనేట్ ను, దానికి రంగునిచ్చేందుకు సోడియం బైకార్బొనేట్ ను కలుపుతున్నారు. ఇలా చేయడం వల్ల ఇరవై నాలుగు గంటల్లో అది ఎరుపు తెలుపు, పసుపు రంగులోకి మారుతుంది.
ఇలా రంగుల్లో ఉన్న బెల్లం వాడద్దు అంటున్నారు, మరి ఎలాంటి బెల్లం కొనాలి అంటే, ముదురు గోధుమ రంగులో ఉన్న బెల్లాన్నే కొనాలి. ఎందుకంటే అదే ఒరిజినల్ బెల్లం ఇక బెల్లం చెరకుతో తయారు చేస్తారు, ఇలా చేసే సమయంలో చెరకు మలినాలు వేడికి ముదురు ఎరుపు రంగులో వస్తుంది అలా ముదురు ఎరుపుగా బెల్లం కలర్ మారుతుంది.. కల్తీ ఎలా గుర్తించాలి అంటే, కొంచెం బెల్లాన్ని నీళ్లలో వెయ్యాలి. దాని వల్ల బెల్లాన్ని కల్తీ చేయడానికి కలిపిన పదార్థాలన్నీ నీటి అడుగుభాగంలో పేరుకుపోతాయి అంటున్నారు నిపుణులు.