తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పదవుల విషయంలో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది, ఇక అధికారానికి దూరంగా రెండు టెర్ములు ఉన్నారు, అయినా ఇంకా ఈ పదవుల పంచాయతీ మాత్రం తేలడం లేదు.
టీపీసీసీకి కొత్త సారథి దాదాపు ఖరారయ్యారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమించేందుకు హస్తినలో నేతలు పిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
దీంతో ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ నేతలు గరం గరంగా ఉన్నారు, అసలు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన రేవంత్ కు ఈ పదవి ఇవ్వడం ఏమిటి.. ఎన్నో దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న తమని మర్చిపోవడం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు.
ఇలాంటి వార్తలు వినిపిస్తున్న వేళ తెలంగాణలో సీనియర్ నేత వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇస్తే తాను కాంగ్రెస్ పార్టీలో ఉండబోనని అన్నారు. నేనే కాదు చాలా మంది పార్టీ వీడతారు అని కామెంట్ చేశారు..కోమటిరెడ్డి, జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ గా పనికిరారా వారు పార్టీకి ఎంతో సేవ చేశారు అని ప్రశ్నించారు, తెలుగుదేశం పార్టీని నాశనం చేసిన రేవంత్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కూడా నాశనం చేస్తారు అని విమర్శించారు. గ్రేటర్ ఎన్నికల్లోరేవంత్ రెడ్డి ఎన్నింటిని గెలిపించారని ప్రశ్నించారు వీహెచ్.