టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ ఈ ఏడాది వరుస సినిమాలు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే, ఇప్పటికే వకీల్ సాబ్ చిత్ర షూటింగ్ జరుగుతోంది.. జనవరికి ఇది షూట్ కంప్లీట్ చేయనున్నారు, ఇక జనవరి నుంచి కొత్త సినిమా కూడా పట్టాలెక్కించనున్నారు, తాజాగా పవన్‌కల్యాణ్-రానా కాంబినేషన్ లో అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఇటీవల ఈ సినిమా స్టార్ట్ చేశారు, అయితే ఇందులో అయ్యప్పన్ నాయర్, కొషీ రోల్స్ చేస్తున్నారు పవన్-రానా… ఇందులో రానా వైఫ్ పాత్రలో ఐశ్వర్యరాజేశ్ ని ఒకే చేశారు చిత్ర యూనిట్, ఇక పవన్ కల్యాణ్ సరసన హీరోయిన్ గా సాయిపల్లవి అని వార్తలు వినిపిస్తున్నాయి, అయితే ఆమె దాదాపు రెండు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.
సాగర్ కే చంద్ర తెలుగు రీమేక్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ పై సాయిపల్లవి-పవన్ కాంబినేషన్ ఉంటుందా లేదా మరొకరు ఫైనల్ అవుతారా అనేది త్వరలో తెలియనుంది.