తెలుగు చిత్ర సీమలో మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది, ప్రముఖ జానపద నేపథ్య గాయకుడు లింగ రాజ్ అనారోగ్యంతో కన్నుమూసారు. ఆయన మంచి గాయకుడిగా సౌత్ ఇండియాలో పేరు తెచ్చుకున్నారు..ప్రముఖ బోనాల పాటైన మాయదారి మైసమ్మపాటతో పాపులర్ అయ్యారు. ఆయన వయసు 66 యేళ్లు.
హైదరాబాద్లోని బొల్లారం ఆదర్శ నగర్లో నివాసం ఉంటున్నారు ఆయన..1987లో ఈయన పాడిన మాయదారి మైసమ్మ పాటతో పాపులర్ అయ్యారు. ఈ పాట ఆనాటి నుంచి ప్రతీ పల్లెల్లో వినిపించేది. ఎక్కడ చూసినా ఈ పాట మార్మోగిపోయేది. దాదాపు 20 ఏళ్లు ఈ పాట అందరి నోట పలికింది.
తర్వాత కోడివాయో లచ్చమ్మది పాటతో యువతను ఊర్రూతలూగించారు. మొత్తం ఇప్పటి వరకూ ఆయన 1000పైగా పాటలతో ప్రేక్షకులను అలరించారు. తర్వాత డిస్కో రికార్డింగ్ కంపెనీ ఏర్పాటు చేసి తన స్నేహితులతో ఎన్నో పాటలు పాటడంతో పాటు స్వరకల్పన చేసారు. దేవతలపై ఆయన ఎన్నో పాటలు పాడారు, ఈయనకు నలుగురు పిల్లలు ఉన్నారు. ఇంత గొప్ప గాయకుడు లేడు అనే మాట ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు, ఆయన అభిమానులని శోక సంద్రంలోకి నెట్టింది ఈ వార్త.