యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.. ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఈ సినిమా పట్టాలెక్కనుంది, వచ్చే ఏడాది మార్చి నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి రానుంది, అయితే ఈ సినిమా టైటిల్ పేరు కూడా బయట ప్రచారంలో ఉంది..అయినను పోయిరావలె హస్తినకు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.
ఎన్టీఆర్ కెరియర్లో 30వ సినిమాగా వస్తున్న ఈ చిత్రం కోసం త్రివిక్రమ్ అదిరిపోయే కథను సిద్ధం చేసారని తెలుస్తోంది, అయితే ఇందులో కాస్టింగ్ కూడా ఫిక్స్ చేస్తున్నారు, ఇక బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఇందులో కీలక పాత్ర చేస్తున్నారు, ఇక ఆయన పొలిటికల్ లీడర్ గా కనిపించనున్నారు.
హారిక హాసిని బ్యానర్ తో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై రాధాకష్ణ చినబాబు – నందమూరి కల్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు…ఈ సినిమాలో సునీల్ విలన్గా కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి, అయితే ఇప్పటికే అరవింద సమేతలో మంచి పాత్ర ఇచ్చారు సునీల్ కి, తాజాగా ఆయనకు త్రివిక్రమ్ ఇందులో ఫుల్ నెగిటీవ్ రోల్ ఇస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి…కలర్ ఫోటో సినిమాతో సునీల్ విలన్గా బాగా చేశారు అనేది తెలిసిందే.