కరోనా సమయంలో చాలా పరిశ్రమలు మూతబడ్డాయి, చైనాలోని వేలాది ఫ్యాక్టరీలు క్లోజ్ అయ్యాయి, కాని మరో కష్టంతో కూడా ఫ్యాక్టరీలు నడవడం లేదట.. చైనాలోని యీవూ సిటీలో కొన్ని నెలలుగా ఫ్యాక్టరీలు సరిగా నడవడం లేదు. క్రిస్మస్ కోసం ఉత్పత్తులను తయారు చేసే ఈ నగరానికి విద్యుత్ కష్టాలు వచ్చాయి.
క్రిస్మస్ టౌన్గా పేరున్న యీవూలో అనేక రకాల వస్తువులు తయారు అవుతాయి, క్రిస్మస్ న్యూ ఇయర్ కి గిఫ్ట్ లు తయారు చేస్తారు, ఇక్కడ నుంచి వస్తువులు ఇతర దేశాలకు వెళతాయి, కాని ఇప్పుడు కరెంట్ కష్టాలు మొదలు అయ్యాయి, గవర్నమెంట్ విధించిన ఐదేళ్ల విద్యుత్ వినియోగ టార్గెట్ ఈ నెల 31తో ముగియనుండడంతో.. దాన్ని అందుకునేందుకు చైనాలోని జేజియాంగ్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
లిఫ్ట్ లు వాడకూడదు, హీటర్లు వాడకూడదు..షాపింగ్ మాల్స్, స్కూల్స్, ఆసుపత్రుల్లో హీటర్లు ఆపేశారు, చాలా చోట్ల చీకటి అలముకుంది. మొత్తానికి ఈ నిర్ణయంతో చాలా మంది కరెంట్ లేక కష్టాలు పడుతున్నారు. ఇక హీటర్లు లేకపోవడంతో వెచ్చదనం కోసం స్వెటర్లు రెండు మూడు వాడుతున్నారు.