విశ్వాసం ఈ మాట చెప్పగానే ముందు మనకు గుర్తు వచ్చేది కుక్క, ఇంత అన్నం పెట్టినా బిస్కెట్ వేసినా అది మన దగ్గర ఉంటుంది, యజమాని శ్రేయస్సు కోరుకుంటుంది, ఎవరూ తమ జోలికి రాకుండా చూస్తుంది, అందుకే కొడుకుల్లా కుక్కలని పెంచుకుంటారు చాలా మంది. అంత విశ్వాసంగా ఉంటాయి అవి.
వాటిని పెంచుకున్న వారు దూరం అయితే అవి కన్నీరు పెట్టుకుంటాయి.. ఎలాంటి ఆహారం కూడా తీసుకోవు, బాధపడతాయి, అయితే ఓ కుక్క చేసిన పని ఇప్పుడు అందరిని కన్నీరు పెట్టించింది, నిజంగా వాటి ప్రేమ ఎంత ఉంటుందో తెలిసేలా చేసింది.
ఓ వీధి కుక్క తనకు రోడ్డున పోయే ఓ వ్యక్తి ఆహారాన్ని ఇస్తే దాని కళ్లలో నీళ్లు వచ్చాయి. అది కృతజ్ఞతతో కళ్ల నీళ్లతో కృతజ్ఞత తెలిపింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, ఈ ఘటన ఎక్కడ జరిగింది అంటే ఉత్తర చైనాలోని షాంక్సీ ప్రావిన్స్లో జరిగింది.
ఈ వీడియో లింక్ ఇదే