ఎ. ఆర్. రెహమాన్ భారతీయ సంగీత దర్శకుడు, స్వరకర్త, గాయకుడు, గీత రచయిత, నిర్మాత, సంగీతకారుడుగా చాలా మంచి ఫేమ్ తెచ్చుకున్నారు.. తండ్రి నుంచి సంగీత వారసత్వం పుచ్చుకున్న రెహమాన్ చిన్న తనం నుంచి సంగీత దర్శకుల దగ్గర సహాయకుడిగా చేశారు.. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. ఇక రోజా సినిమా నుంచి ఆయన సంగీత ప్రపంచంలో ఎంతో పేరు పొందారు.
ఆస్కార్ అవార్డు గ్రహిత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇంట్లో విషాద ఘటన జరిగింది…ఏఆర్ రెహమాన్
తల్లి కరీమా బేగం సోమవారం కన్నుమూశారు… మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా కరీమా బేగానికి నలుగురు సంతానం.
అందరిలో చిన్న వాడు రెహమాన్, ఇక భర్త ఆర్కే శేఖర్ రెహమాన్ తొమ్మిదేళ్ల వయసులో కన్నుమూశారు, ఈ విషయం తెలిసి సినీ ప్రముఖులు ఆయనకు ఫోన్ చేసి పరామర్శిస్తున్నారు.