బిగ్బాస్ తెలుగు సీజన్ 4 లో పాల్గొన్న కంటెస్టెంట్లకు ఈసారి మంచి ఫేమ్ వచ్చింది.. టాప్ 5లో ఉండి విన్నర్ అయ్యారు అభిజిత్, ఆయనకు మంచి ఫేమ్ వచ్చింది, తర్వాత సోహెల్, అఖిల్ హారిక అరియానాకి మంచి గుర్తింపు వచ్చింది, ఇక వీరికి ఇప్పుడు సినిమా అవకాశాలు పలు వెబ్ సిరీస్ అవకాశాలు వస్తున్నాయి.
ఇక హౌస్ లో ముఖ్యంగా అరియానా – అవినాష్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఈ జంటని చూసి అందరూ బాగుంది అన్నారు.తాజాగా ఓ గుడ్ న్యూస్ వీరి అభిమానులకి ఈ సీజన్లో క్రేజీ జంటగా పేరొందిన అరియానా-అవినాష్ జోడీకి మంచి ఆఫర్ వచ్చిందట.
ఈ సీజన్లో గుడ్ పెయిర్గా గుర్తింపు పొందిన ఈ జంటతో ఇప్పుడు కొన్ని ఛానెల్స్ ప్రత్యేక ప్రోగ్రామ్లను ప్లాన్ చేస్తున్నారట. వీరిద్దరూ హోస్ట్ గా యాంకర్లుగా అదరగొట్టేలా ప్రోగ్రామ్ చేయనున్నారు అని తెలుస్తోంది…హోస్ట్గా అరియానాకు మంచి అనుభవం ఉంది.. అలాగే అవినాష్ కూడా శ్రీముఖితో కలిసి ఓ షోను హోస్ట్ చేశాడు. సో ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయట, దీనిపై త్వరలో ప్రకటన రానుంది.