డయాబెటీస్ మధుమేహం షుగర్ ఏ పేరు పెట్టి పిలిచినా ఇది అటాక్ అయింది అంటే చాలా ఇబ్బంది.. అందుకే ముందు నుంచి జాగ్రత్త తీసుకుంటే షుగర్ సమస్య లేకుండా ఉండవచ్చు.ఇష్టమైనవి తినలేక.. ఆశను చంపుకోలేక ముప్పు తిప్పలు పడాలి షుగర్ సమస్య ఉంటే… మీరు ఆహార అలవాట్లు మార్చుకోవాలి… వైట్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్ తీసుకోవాలి.. కార్బోహైడ్రేట్స్ హెవీగా తీసుకోకూడదు.
మరి ఈ ఆహారం తీసుకోకుండా ఉంటే బెటర్ అంటున్నారు నిపుణులు..మరి ఆ ఫుడ్ ఏమిటి అనేది చూద్దాం..
తెల్ల అన్నం వైట్ రైస్ ఇది ఎక్కువ తీసుకోవద్దు… ఒక పూట తీసుకుంటే చాలు. సాయంత్రం టిఫిన్ లాంటివి తీసుకోవచ్చు. రాగులు సజ్జలు జొన్నలు లాంటివి బెటర్. ఇక వైట్ రైస్ లో ఉండే అత్యధిక కార్బోహైడ్రేట్లు చక్కెర స్థాయిలను పెంచేస్తాయి అందుకే అన్నానికి దూరంగా ఉండాలి.
*ఈ ఆహారాలు తీసుకోవద్దు అంటున్నారు నిపుణులు*
బంగాళదుంప
ఎండు ద్రాక్ష
బ్రెడ్
రైసిన్స్
ఫ్యాట్ మిల్క్
కేకులు, ఐస్ క్రీమ్స్, క్రీమ్ కోవాలు, స్వీట్లు
పళ్లరసాలు షుగర్ లేకుండా తీసుకోవాలి
ఎనర్జీ డ్రింకులు వద్దు
సాఫ్ట్ డ్రింకులు వద్దు
మటన్ తీసుకోవద్దు దీని బదులు చికెన్, చేపలు తినడం మంచిది.
ఫ్రెంచ్ ఫ్రైస్ ప్యాకేజ్ డు ఫుడ్స్ ఆయిల్ డీప్ ఫ్రై ఫుడ్ జోలికి వెళ్లకండి
బియ్యం పిండితో చేసిన ఫుడ్ కూడా డేంజర్.