నైలు నది మొసళ్ల గురించి వినే ఉంటారు కొందరు, ఇవి చాలా వేగంగా వెళతాయి …అంటే కాదు టార్గెట్ ని ఫిక్స్ చేసుకుంటే పట్టుకునే వరకూ అలసిపోవు.. అందుకే నైలు నది తీరంలో వీటిని చాలా మందిచూసి జంకుతారు, మరెక్కడా లేని ప్రత్యేకత వీటి సొంతం.. దాదాపు ఇవి 20 అడుగుల పొడవు. 750 కేజీల బరువు ఉంటాయి, ఏనుగుని కూడా నేలపై కదలకుండా కట్టిపడేస్తాయి.
చిరుతని కూడా వదిలిపెట్టదు.. 0.25 కంటే పదునుగా ఉంటాయి వీటి పళ్లు… ఇతర మొసళ్లను కూడా ఇవి వదలవు. అంతటి భయంకరమైన జీవులివి…ఆఫ్రికాలో నీళ్లు తాగడానికి వచ్చిన ఓ చిరుతపులిని పట్టుకుని చంపేసింది నైలు నది మొసలి.. సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ వీడియో.
ఇక్కడ ప్రజలు కూడా వీటి బారిన పడి వందల మంది చనిపోయారు..ఇవి ఆఫ్రికాతో పాటు నైలు నది పరిసరాల్లోనూ, మడగాస్కర్ లోని నదుల్లోను, చిత్తడి నేలల్లోను, మడ అడవుల్లోనూ ఎక్కువగా కనిపిస్తాయి. చేపలను ఇష్టంగా తింటాయి, ఇక తర్వాత ఏ జంతువుని అయినా వదిలిపెట్టవు.. ఈ నైలు మొసళ్లు మాత్రం గుడ్లు పెట్టిన తరువాత వాటికి కచ్చితంగా కాపలా ఉంటాయి. ఎవరైనా వాటిని టచ్ చేస్తే ఇక అంతే. కేవలం 600 మొసళ్ల వరకూ ఇవి ఉంటాయి అంటున్నారు నిపుణులు.