క్రిస్మస్ పండగ వచ్చింది అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు, అయితే ఈ పండుగ రోజు
ప్రధాన ఆకర్షణగా నిలిచేది క్రిస్మస్ తాతయ్య అంటే శాంతాక్లాజ్. మరి ఆయన పిల్లలు అందరికి గిఫ్టులు చాక్లెట్స్ కుకీస్ ఇస్తూ ఉంటాడు, ఇలా పలు బహుమతులు ఇచ్చి పిల్లలని ఆనందింప చేస్తాడు. మరి ఈయన ఎవరు అసలు శాంతాక్లాజ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
శాంతాక్లాజ్ అనే వారు ఒకప్పుడు నిజంగానే ఉన్నారని చరిత్రకారులు అంటున్నారు. క్రీస్తుశకం 343లో శాంతాక్లాజ్ మరణించినట్టు చరిత్రకారులు అంటున్నారు. ఆయనకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం, ఆయన పిల్లల ఆనందంలో కోసం ఇలా చాకెట్లు బిస్కెట్లు అందించేవారట, అలా తనకు వచ్చిన ఆదాయం పిల్లలకు పెట్టేవాడు, అంతేకాదు తన జీవితంలో సంపాదించిన సంపద పిల్లలకే ఖర్చు చేశారు.
వారి కళ్లల్లో ఆనందం చూసేవారు, మొదట్లో శాంతాక్లాజ్ వేడుకలు డిసెంబర్ 6 జరిగేవి. ఆ తర్వాత అవి డిసెంబర్ 24కు మారాయి. ఆయన ఆకాశంలో పయనిస్తూ పిల్లలకు గిఫ్టులు ఇస్తాడు అని అంటారు, శాంతాక్లాజ్ వివిధ రూపాల్లో వచ్చి పిల్లలకు బహుమతులు ఇస్తాడు అని నమ్ముతారు.. అందుకే అలా శాంతాక్లాజ్ రూపంలో పిల్లలకు గిఫ్టులు చాక్లెట్లు చాలా మంది ఇస్తారు… క్రిస్మస్ తాతగా శాంతా క్లాజ్గా పిలవబడే వ్యక్తి పేరు సెయింట్ నికోలస్.