ఈ రోజుల్లో చాలా మంది జంక్ ఫుడ్ అతిగా తింటున్నారు. దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా తాజా పరిశోధనల్లో నిద్రలేమికి జంక్ ఫుడ్ కు ప్రత్యక్ష సంబంధం ఉందనే విషయాన్ని తెలుసుకున్నారు.. ఇక కూల్ డ్రింకులు అతిగా తాగినా సమస్యలు వస్తాయి..ఫాస్ట్ ఫుడ్ తరచూ లాగించటం వల్ల నిద్రలేమి సమస్య పట్టి పీడిస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
ఎవరైతే వారానికి రెండు మూడు రోజులు జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ తింటారో వారికి ఈ నిద్రలేమి సమస్య ఉంటుంది, మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఇక పిల్లలు వీటిని తీసుకుంటే , పిల్లలో స్ట్రెస్ ఎక్కువగా ఉండటం నీరసం అలసట వస్తుంది.. కార్బొనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్ లో ఉన్న కెఫిన్ వల్ల మానసిక ఒత్తడి కూడా పెరుగుతుంది.
12-15 ఏళ్ల వయసు ఉన్న విద్యార్దుల్లో పరీక్ష చేస్తే వీరికి కూడా ఈ సమస్య కనిపించింది..టీనేజర్లు మానసికంగా, శారీరకంగా ఎదగాల్సిన వయసులో జంక్ ఫుడ్ వల్ల ఎదగకుండా ఉంటున్నారు అని అంటున్నారు. సో పిల్లలకు ఇకనైనా ఈ జంక్ పుడ్ ని దూరంగా పెట్టండి, పెద్దవారు కూడా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి.