పవర్ బ్యాంక్ వాడుతున్నారా ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

-

పవర్ బ్యాంక్ ఇప్పుడు ఎక్కడ చూసినా వీటిని అందరూ వాడతున్నారు… స్మార్ట్ఫోన్లో ఛార్జింగ్ లేనప్పుడు ఆదుకునే గ్యాడ్జెట్ గా మారిపోయింది..ఎక్కువగా జర్నీ చేసేవాళ్లు తప్పనిసరిగా పవర్ బ్యాంక్ వాడుతున్నారు..ట్యాబ్లెట్స్, కెమెరాలు, స్మార్ట్వాచ్లు, ఫోన్లు ఇలా వేటిని అయినా చార్జ్ చేయవచ్చు.

- Advertisement -

మీ స్మార్ట్ఫోన్లో బ్యాటరీ ఎంత ఉంటుందో దానికి రెండు రెట్లు పవర్ బ్యాంక్ లో ఉండేలా చూసుకోండి. మీ స్మార్ట్ఫోన్లో 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటే 10,000ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ తీసుకోవాలి. భారీ బ్యాటరీ కెపాసిటీ ఉన్న స్మార్ట్ఫోన్లు వాడే వారు పవర్ బ్యాంకు వాడక్కర్లేదు అంత అవసరం ఉండదు.

జర్నీలు చేసేవారు బాగా ఫోన్ వాడేవారు 20,000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న పవర్ బ్యాంక్ తీసుకోవడం మంచిది. దీని వల్ల మీరు మూడు సార్లు మీ ఫోన్ ఫుల్ చార్జ్ చేయవచ్చు.. ఇక మీరు పవర్ బ్యాంక్ కొనేముందు అది ఎంత వేగంగా చార్జ్ ఎక్కుతుందో స్పెసిఫికేషన్ చూసుకోవాలి.

సర్క్యుట్ ప్రొటెక్షన్ కూడా ఉండాలి. ఎల్ఈడీ ఇండికేటర్ లేదా డిజిటల్ డిస్ప్లే ఉన్న పవర్ బ్యాంక్ తీసుకోవాలి. దీని వల్ల ఎంత పవర్ ఉంది అనేది తెలుస్తుంది. ఇక పూర్తిగా పవర్ బ్యాంక్ ఖాళీ అవ్వకుండా చార్జ్ చేసుకోవాలి…10,000ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ మీరు చార్జ్ పెడితే సుమారు నాలుగు గంటల సమయం పడుతుంది. మీకు పవర్ సప్లై ఉన్న సమయంలో దీని వాడకం తక్కువగా ఉండాలి. రోజు వాడుతూ ఉంటే లైఫ్ టైమ్ తగ్గుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

లవంగాలతో ఇన్ని లాభాలా..

లవంగాలు(Cloves).. భారతదేశ వంటకాల్లో తరచుగా వాడే దినుసుల్లో ఒకటి. వీటి వల్ల...

పాకిస్థాన్‌లో పర్యటించనున్న కేంద్ర మంత్రి

కేంద్ర మంత్రి హోదాలో పాకిస్థాన్‌లో పర్యటించడానికి సిద్ధమయ్యారు కేంద్ర విదేశాంగ శాఖ...