ఈ 2020 అత్యంత దారుణమైన ఏడాది అనే చెప్పాలి, ఓ పక్క ప్రకృతి వైపరిత్యాలు మరో పక్క కరోనా భూకంపాలు ఇలా చాలా మంది కుటుంబాల నుంచి దూరం అయ్యారు.. లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు.. అయితే తాజాగా భూకంపం సంభవించింది క్రొయేషియాలో.
భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకటించింది.పెట్రింజా సెంట్రల్ పట్టణంలో కొన్ని భవనాలు చాలా వరకూ కుప్పకూలిపోయాయి, ఇక ఇదే ప్రాంతంలో సోమవారం భూకంపం వచ్చింది ..మళ్లీ ఇదే ప్రాంతంలో నేడు కూడా భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనకు గురి అయ్యారు.
మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఈ భూకంపం సంభవించినట్లు తెలియచేశారు, దాదాపు 50 కిలోమీటర్ల పరిధి వరకూ ఈ తీవ్రత కనిపించింది… ఒక్కసారిగా ప్రజలు బయటకు పరుగులు తీశారు.. చాలా వరకూ ఇల్లు కూలితే మరికొన్ని ఇళ్లు పైకప్పులు ధ్వంసం అయ్యాయి, ప్రాణ నష్టం ఆస్ధి నష్టం ఎంత అనేది ఇంకా తెలియాల్సి ఉంది.