ఈ మధ్య దొంగల బెడద పెరిగింది, దీంతో ఊర్లు వెళ్లి వచ్చిన తర్వాత ఇంట్లో దొంగలు పడిన విషయం తెలుసుకుని పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదులు చేస్తున్న వారు చాలా మంది ఉంటున్నారు.. దీంతో ప్రజలు కూడా దీనిపై జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు పోలీసులు.. టెక్నాలజీ ఉపయోగించి ఇకపై దొంగల ఆట కట్టించవచ్చు మరి అది ఎలాగో చూద్దాం.
లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఎల్హెచ్ఎంఎస్ అనే యాప్ను ఉపయోగిస్తున్నారు పోలీసులు, దీని వల్ల మీ ఇళ్లు సేఫ్ ఎలాంటి దొంగల బెడద ఉండదు.. మరి ఇది ఎలా అనేది చూద్దాం.. మీరు ఇంటి నుంచి మూడు రోజులు బయటకు వెళితే ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. ఈ సమయంలో స్ధానిక పోలీస్ స్టేషన్ అక్కడ చూపిస్తుంది. దానికి రిక్వెస్ట్ పంపాలి.
మీరు ఊరు వెళ్తున్న తేదీ, సమయం, మళ్లీ ఎప్పుడొస్తారనే వివరాలను కచ్చితంగా ఇవ్వాలి, ఈ సమయంలో పోలీసులు మీ ఇంటికి వచ్చి ఓ కెమెరా పెడతారు, దానిని వైఫైతో కనెక్ట్ చేస్తారు.. ఒకవేళ ఆ తలుపు ఎవరైనా తెరిచినా తట్టినా కచ్చితంగా అక్కడ అలారం సౌండ్ చేస్తుంది, అది పోలీసులకు కమాండ్ కంట్రోల్ రూమ్కు చేరుతుంది..వెంటనే దగ్గర్లోని పోలీసులను అలెర్ట్ చేస్తారు. అంతేకాదు రోజుకు రెండుసార్లు పోలీసులు వచ్చి చూసి వెళ్తుంటారు. ఈ సర్వీసుని మీరు ఉపయోగించుకోవచ్చు.
.