రాజకీయంగా ఎంపీ ఎమ్మెల్యే స్ధానాలు గెలవాలి అంటే దాదాపు కోట్లు ఖర్చు అవుతోంది.. కాని ఇప్పుడు సీన్ మారింది. పంచాయతీ వార్డు మెంబర్ మున్సిపల్ కౌన్సిలర్ కార్పొరేటర్ అలాగే సర్పంచ్ పదవులకి కూడా కోట్ల రూపాయలకు ఖర్చు అవుతోంది.. అయితే పదవుల కోసం కోట్లరూపాయలు ఖర్చు చేస్తున్నారు నేతలు… తాజాగా ఓ సర్పంచ్ పదవి కోసం ఏకంగా రెండు కోట్లు ఖర్చు పెట్టి ఏకగ్రీవం అయ్యాడు ఓ వ్యక్తి.
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని దేవ్లాలీ తాలూకాలోని ఉమ్రానే అనే గ్రామంలో సర్పంచ్ పదవికి గ్రామంలో వేలం వేశారు. ఇది అనధికారికంగా సీక్రెట్ గా జరిగిన వేలం… ఇక్కడ ప్రారంభం దాదాపు 1.11 కోట్లకు స్టార్ట్ అయింది.. చివరకు అది రూ.2.05 కోట్లకు చేరింది…సర్పంచ్ పదవిని విశ్వాస్ రావ్ దేవరా అనే వ్యక్తి పాడుకున్నాడు… ఇక అతనికి ఎవరూ పోటీ లేకుండా అతనే ఏకగ్రీవం అయ్యాడు.
ఎన్నికల ప్రక్రియ లేకుండానే సర్పంచిగా ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. మరి ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బుతో తమ గ్రామంలో రామేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మిస్తామని తెలిపారు, ఇదేం తంతు ఎన్నికలు జరగకుండా ఇలా నగదుతో ఏకగ్రీవం చేసుకోవడం ఏమిటి.. ఇది ఎన్నికల ప్రక్రియ అపహాస్యం చేయడమే అని కొందరు కేసులు పెడుతున్నారు.