మెంతులు చాలా మంది చేదుగా ఉంటాయి అని తీసుకోరు.. మరికొందరు ఎంత చేదుగా ఉన్నా తింటారు.. నానబెట్టుకుని ఉదయం తినేవారు చాలా మంది ఉన్నారు. అయితే వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యలను దూరం అవుతాయి. వీటని పొడి చేసుకుని తీసుకున్నా… వీటిని నానబెట్టి ఆ నీటిని తాగడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి, ముఖ్యంగా వంటల్లో వీటిని వాడటం వల్ల ఆ సారం శరీరంలోకి వెళ్లి చాలా జబ్బులు రాకుండా చేస్తుంది.
మెంతుల్లో పోషకాలు, పీచు పదార్థాలు, ఇనుము, విటమిన్ సి, బి1, బి2, కాల్షియంలు ఉంటాయి. బాలింతలు ఈ మెంతులను నేరుగా తీసుకున్నా పొడి రూపంలో తీసుకున్నా పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఇక మెంతికూర పప్పు తీసుకున్నా చాలా మంచిది.
మెంతులను నానబెట్టి ఆ నీటిని జుట్టుకి మసాజ్ చేయండి. అలాగే నానబెట్టిన మెంతులని పేస్ట్ గా చేసుకుని ఆ పేస్ట్ జుట్టుకి పెడిత చుండ్రు సమస్యలు తొలగిపోతాయి, జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది. మెంతులు నానబెట్టిన నీటిని తీసుకుంటే మలబద్దకం సమస్య ఉండదు. అజీర్తి జీర్ణ సమస్యలు తొలగిపోతాయి.. 3 రోజులకి ఓసారి స్పూన్ మెంతులు తీసుకున్నా మంచిదే. మెంతుల నీటిని రెగ్యులర్గా తాగడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది.