కరోనాతో రైలు సర్వీసులు కొన్ని నెలలు నిలిచిపోయాయి.. ఇప్పుడు కొన్ని సర్వీసులు మాత్రమే పట్టాలెక్కాయి.. ఇక సంక్రాంతి సమయంలో కొన్ని రైళ్లు నడుపుతుంది రైల్వే శాఖ.. అయితే తాజాగా ఓ గుడ్ న్యూస్ తెలిపింది ప్రయాణికులకి.
కరోనా సమయంలో ప్యాసింజర్ల భద్రతను పరిగణలోకి తీసుకొని ఇండియన్ రైల్వేస్.. ఏసీ కోచ్‌లలో బ్లాంకెట్స్ కర్టెన్ల ను కూడా తొలగించింది… ఈ సమయంలో బ్లాంకెట్లను ప్రయాణికులు తెచ్చుకున్నారు.
తాజాగా కొత్త ఏడాది నుంచి ఇండియన్ రైల్వేస్ కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది.
తాజాగా ప్రయాణికులకి డిస్పోజబుల్ బెడ్‌రోల్ కిట్ అందించాలని ఇండియన్ రైల్వేస్ నిర్ణయం తీసుకుంది… ఓపక్క చలి దారుణంగా పెరుగుతోంది, దీంతో ప్రయాణికులకి ఈ సౌలభ్యం ఇవ్వనుంది.
డిస్పోజబుల్ ట్రావెల్ కిట్ ధర రూ.275గా ఉంది. ఈ నగదు అదనంగా ఇవ్వాలి. మరి ఏమి అదనంగా ఇస్తారు అంటే…ఒక బ్లాంకెట్, రెండు బెడ్ షీట్స్, ఒక తలదిండు, ఒక హెడ్ కవర్, ఒక జత చేతి గ్లౌజ్‌లు, మాస్క్, పేపర్ సోప్, హ్యాండ్ శానిటైజర్, పేపర్ నాప్కిన్ అందచేస్తారు.