ఫ్యాట్ ఉండేవి కొలెస్ట్రాల్ ఉండేవి ఇలాంటి ఫుడ్ డాక్టర్లు తినద్దు అంటారు, మరి ఎలాంటి ఫుడ్ తింటే మంచిది.. బ్రేక్ ఫాస్ట్‌కు ముందు ఏం తినే అలవాటు చేసుకోవాలి అని చాలా మంది తెగ ఆలోచన చేస్తూ ఉంటారు.. అయితే ఇలాంటి సమయంలో ఎలాంటి ఫుడ్ తినాలి ఏమి తింటే మంచిది అనేది ఇప్పుడు చూద్దాం.
లేవగానే సిట్రిస్ పండ్లు ఇలాంటివి తినద్దు …జ్యూస్ ల జోలికి అస్సలు వెళ్లవద్దు, ఇక గోరు వెచ్చని నీటిలో తేనె నిమ్మరసం కలుపుకుని తాగండి.. మలబద్దకం కూడా పోతుంది. కడుపు ఫ్రీగా ఉంటుంది.. రాత్రి నానబెట్టిన బాదం ఐదు తీసుకోండి, మళ్లీ జీడిపప్పు వద్దు బాదం మాత్రమే ఉదయం తీసుకోండి. ఇక కిస్ మిస్ ఎండు ద్రాక్ష కూడా ఉదయం తీసుకోవచ్చు.
బాదంలో విటమిన్ ఈతో పాటు మాంగనీస్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇక ఉదయం 9 తర్వాత ఓ బొప్పాయి ముక్క తీసుకోవచ్చు ఇది మంచిదే.. అయితే ఇది తీసుకున్న గంట వరకూ ఎలాంటి ఫుడ్ తీసుకోవద్దు, ఇలా తేనె నిమ్మరసం లేదా తెనె గోరువెచ్చని నీరు ఉదయం తాగి బాదం తీసుకుంటే చాలా మంచిది.. పిల్లలు పెద్దలు కాఫీ టీలకు దూరంగా ఉంటే ఎలాంటి జబ్బులు రావు.