మనకు వైట్ రైస్ తెలుసు ,ఇటీవల చాలా చోట్ల బ్రౌన్ రైస్ కూడా వాడుతున్నారు, అయితే మార్కెట్లో ఇంకా చాలా రకాల ధాన్యాలు ఉన్నాయి, అందులో రెడ్ రైస్ బ్లాక్ రైస్ కూడా ఒకటి.. మనం రెడ్ రైస్ గురించి బ్రౌన్ రైస్ గురించి ఇప్పటికే తెలుసుకున్నాం, మరి బ్లాక్ రైస్ గురించి కూడా తెలుసుకుందాం, మంచి పోషకాలు ఉన్నాయి ఇందులో.
చైనీస్ వంటల్లో బ్లాక్ రైస్ ని వాడుతూనే ఉన్నారు, ఇప్పటికీ చాలా మంది యూరప్ అలాగే చైనా స్విడన్ ఇలాంటి ప్రాంతాల్లో నల్ల రైస్ ని వాడతారు… దీన్ని ఫర్బిడెన్ రైస్ అని కూడా పిలుస్తారు, గతంలో రాజులు అందరూ దీనిని ఇష్టంగా తినేవారట..
ఈ బ్లాక్ రైస్ లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటో న్యూట్రియెంట్స్, ఫైటో కెమికల్స్, విటమిన్ ఈ, ప్రోటీన్, ఐరన్ ఉన్నాయి.
ఇక దీనిని రోజుకి ఓ కప్పు తీసుకున్నా క్యాన్సర్ రాకుండా చేస్తుంది.. ఈ రైస్ ఉడకకముందు బ్లాక్ గా, ఉడికాక కొద్దిగా పర్పుల్ కలర్ లో ఉంటుంది. ఒక కప్పు రైస్ తీసుకుంటే మీకు 160 క్యాలరీలు మాత్రమే ఉంటాయి, సో బరువు తగ్గుతారు
షుగర్ లాంటి సమస్యలు రావు.