ప్రముఖ నటి రేణు దేశాయ్ కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు, అయితే తాజాగా ఆమె మళ్లీ సినిమాల్లో నటించేందుకు రెడీ అయ్యారు అని వార్తలు వినిపిస్తున్నాయి.. తాజాగా ఆమె తెలుగు సినిమాలో నటించేందుకు రెడీ అయ్యారట.. అయితే తాజాగా ఓ సినిమా కథ కూడా విన్నారు అని తెలుస్తోంది, అయితే ఆ సినమా ఏమిటో కాదు మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట చిత్రం.
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించే సినిమాలో ఆమె కీలక పాత్ర పోషించనుందంటూ టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి, ఇందులో మహేష్ కి ఆమె వదిన పాత్రలో కనిపించనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి, తాజాగా టాలీవుడ్ వార్తల ప్రకారం రేణుతో ప్రస్తుతం దర్శక నిర్మాతలు సంప్రదింపులు జరుపుతున్నారట.
అయితే దీనిపై అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది, అయితే బ్యాంకు కుంభకోణాల నేపథ్యంలో ఈ సినిమా రానుంది, ఇక ఇప్పటికే భాగ్యనగరంలో బ్యాంక్ సెట్ కూడా వేశారు.. నెల రోజులు ఇక్కడ షెడ్యూల్ ఉంటుంది, ఇక తర్వాత అమెరికాలో షూట్ జరుగుతుంది..మహేశ్ సరసన కీర్తి సురేశ్ నటిస్తుంది.