యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు.. ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఈ సినిమా ప్రారంభం కానుంది.. అన్నీ సెట్ అయితే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈసినిమా షూటింగ్ ప్రారంభించాలి అని చిత్ర యూనిట్ భావిస్తోంది.. ఇక త్రివిక్రమ్ టీమ్ ఇప్పటికే కథ సిద్దం చేశారు నటీనటుల ఎంపిక కూడా పూర్తి చేస్తున్నారు. అయితే హీరోయిన్ ఎవరు అంటే చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి.. ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉండే అవకాశం ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి.
ఓ హీరోయిన్ గా రష్మిక మందన్నను ఎంపిక చేసినట్టు సమాచారం. మరో కథానాయికగా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ ని ఆలోచిస్తున్నారట… ఇక ఆమెతో చర్చలు జరిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మరో హీరోయిన్ గా రకుల్ లేదా సమంత తమన్నా పేర్లు వినిపిస్తున్నాయి.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపైఎస్. రాధాకృష్ణ, నందమూరి కళ్యాణ్రామ్ సంయుక్తంగా నిర్మించనున్నారు ఈ చిత్రాన్ని, ఇక ఈ సినిమాకి బాణీలు థమన్ అందిస్తున్నారు, ఇక చాలా మంది సీనియర్ నటులు ఇందులో నటించనున్నారు, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, కన్నడ నటుడు ఉపేంద్ర, మలయాళ నటుడు జయరామ్ ఇందులో కీలక పాత్రలు చేస్తున్నారు, ఇక ఈ సినిమాకు అయినను పోయిరావలె హస్తినకుఅనే టైటిల్ ఆలోచిస్తున్నారట. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ ఈ షూటింగ్ కు రానున్నారు.