మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నారు.ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ఆచార్య సినిమాలో కూడా ఆయన నటిస్తున్నారు.. అది ఫ్రిబ్రవరి నుంచి షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది…ఆచార్య చిత్రంలో చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మరి తర్వాత చెర్రీ ఏ సినిమా చేస్తారు.. ఇంకా దీనిపై ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు అని అందరూ ఎదురుచూస్తున్నారు.
మెగా అభిమానులు కూడా దీని గురిచి ఎదురుచూస్తున్నారు, తాజాగా దీనిపై ఓ క్లారిటీ వస్తోంది, లాక్ డౌన్ సమయంలో చరణ్ పలువురు దర్శకులు చెప్పిన కథలు విన్నారట, అందులో ముఖ్యంగా జెర్సీచిత్రంతో సక్సెస్ కొట్టిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కూడా ఓ కథ చెప్పాడని, అది చరణ్ కు నచ్చింది అని తెలుస్తోంది.
ఇక అదే తదుపరి సినిమా అని వార్తలు వస్తున్నాయి టాలీవు్డ్ లో… ఈ క్రమంలో ప్రముఖ తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ పేరు కూడా వినిపిస్తోంది. ఇక ఆయన కూడా కథ చెప్పారట, చరణ్ ని కలసి ఓ లైన్ చెప్పాను. త్వరలోనే పూర్తి కథ చెబుతాను అంటూ లోకేశ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు… ఇక ఆయన తాజాగా మాస్టర్ సినిమా చేస్తున్నారు.. సంక్రాంతికి ఇది విడుదల కానుంది విజయ్ హీరోగా ఈ సినిమా చేస్తున్నారు…ప్రస్తుతం కమలహాసన్ తో లోకేశ్ విక్రమ్ అనే సినిమా కూడా చేస్తున్నారు. మరి వీరిద్దరిలో ఎవరికి చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారో చూడాలి.