ఈ ఏడాది 2021 కన్యా రాశి ఫలాలు ఎలా ఉండబోతోంది అనేది చూద్దాం.. 2021 ఐదవ ఇంట్లో శని ఉండడం వల్ల అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో కాస్త ఒడిదుడుకులు ఉన్నాయి మార్చి నెల నుంచి.. వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, లేకపోతే నష్టాలు సంభవించవచ్చు. ఇక సొంత వ్యాపారాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి అప్పులు ఇచ్చి మోసపోయే ప్రమాదం ఉంది.
ఐటీ మెటల్ ఉడ్ బిజినెస్ వారికి మార్చి నుంచి చాలా అనుకూలంగా ఉంది..2021 విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. రాజకీయాలు, సామాజిక సేవలు విద్యారంగంలో ఆటుపోటులు ఉంటాయి.. రాజకీయ నేతలకు కొత్త పదవులు వచ్చే చాన్స్ ఉంది, వైద్యులకి వైద్య రంగంలో ఉన్న వారికి ఈ ఏడాది చాలా అదృష్టం కలిసి రానుంది.
ఇక సంతానం కోసం చూసే వారికి ఈ ఏడాది చివరన గుడ్ న్యూస్ వస్తుంది… భార్య భర్తలకు బయట వారి వల్ల మనస్పర్దలు వచ్చే అవకాశం కనిపిస్తోంది.. కోర్టు కేసులు మీకు ఈ ఏడాది సమసిపోవు, ఇక తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో నగదు ఖర్చు అవుతుంది. చదువు కోసం విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్న విద్యార్థులు జనవరి నుంచి మే వరకూ బాగుంది. సొంత ఇంటి నిర్మాణం ఈ ఏడాదిలో చేస్తారు.


