సముద్రంలో అలలు ఉద్ధృతంగా వస్తున్న సమయంలో లోపలికి వెళితే ఇక అంతే సముద్రంలో వారిని కాపాడటం చాలా కష్టం.. ఆ భారీ రాకాశి అలలు లోపలికి తీసుకువెళ్లిపోతాయి.. తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది ఓ మహిళ సముద్రలో ఉదృతంగా వచ్చిన అలలను దాటలేక లోపలికి వెళ్లిపోయింది..
వెంటనే ఓ సర్ఫర్ స్పందించి ఆమెను కాపాడాడు. ఒడ్డుకు తీసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హవాయ్లోని పసిఫిక్ సముద్రం తీరాన ఈ సంఘటన జరిగింది.. మైకీ అనే సర్ఫర్ ఆమెని ఒడ్డుకు తీసుకువచ్చాడు, ఇలా వేగంగా ఆమె లోపలికి వెళ్లిపోతోంది.. ఒక్కసారిగా అలల ఉదృతి పెరిగింది ఆమె రాలేకపోయింది.
ఆ సమయంలో మైకీ అనే సర్ఫర్ దైర్యంగా లోపలికి వెళ్లాడు ఆమెని క్షేమంగా బయటకు తెచ్చాడు, ఆమె ఎంతో కంగారు పడిపోయింది కాస్త బయటకు వచ్చిన తర్వాత ఆ టెన్షన్ నుంచి తేరుకుంది. ఇక పక్కనే ఉన్న ఆమె కొడుకు కూడా మా అమ్మని కాపాడి నందుకు థాంక్స్ అని అతనికి కృతజ్ఞతలు తెలిపాడు.
ఈ వీడియో మీరు చూడండి
https://www.instagram.com/p/CJferABABdg/