మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే, కొరటాల శివ ఈసినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.. ఇక ఈనెల చిరుతో మొత్తం షూటింగ్ కంప్లీట్ అవుతుంది …ఫ్రిబ్రవరి నుంచి రామ్ చరణ్ షూటింగులో పాల్గొనబోతున్నారు, అయితే ఈ సినిమా అనేక రికార్డులు క్రియేట్ చేస్తోంది అనే చెప్పాలి.
ఈ సినిమా షూటింగ్ హైదారాబాద్ కోకాపేటలో జరుగుతోంది. ఈ సినిమా కోసం కొరటాల శివ కోకాపేటలో భారీ సెట్ వేయించారట, ఇప్పటి వరకూ ఎవరూ చేయని ఓ సాహసం చేశారు… ఏమిటి అంటే దాదాపు 21 ఎకరాల్లో ఈ సెట్ వేశారట…మొత్తం టెంపుల్స్ టౌన్ గా దీనిని నిర్మించినట్లు తెలుస్తోంది.
దీని కోసం కొన్ని నెలలుగా వర్క్ జరుగుతోంది..ఇండియాలోనే ఇది ది గ్రేట్ సెట్ అని అంటున్నారు. ఈ ఫోటోలు కూడా బయటకు రాకుండా అక్కడ షూటింగులో లొకేషన్ కు ఎవరిని మొబైల్స్ కూడా అనుమతించడం లేదు.. ఇక చరణ్ కు సంబంధించిన షూట్ పూర్తి అయితే సినిమా కంప్లీట్ అయినట్లే, వేసవిలో విడుదలకు ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్.