తెలుగు బిగ్ బాస్ సీజన్-4 పూర్తి అయింది టైటిల్ విన్నర్ గా అభిజిత్ నిలిచారు, అయితే ఈ మూడు సీజన్లలో రాని ఫేమ్ ఈసారి సీజన్ 4లో పాల్గొన్న వారికి అందరికి వచ్చింది అనే చెప్పాలి,, ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు సినిమా అవకాశాలు వస్తున్నాయి అందరికి.. మరీ ముఖ్యంగా అభిజిత్ అఖిల్ సోహెల్ కి పలు చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి..
ఇక మోనాల్ కు అయితే వరుస అవకాశాలు వస్తున్నాయి ఇప్పటికే ఓ షోలో జడ్జ్ గా మారింది.. మరో రెండు సినిమాలు కూడా ఆమెకి వచ్చాయట..హీరోయిన్ మోనల్ కు హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత డిమాండ్ కూడా పెరిగిపోయింది. ఇక టీవీషోలతో పాటు రెండు వెబ్ సిరీస్ లలో కూడా అవకాశాలు వచ్చాయట.
ఇక ఈ గుజరాతీ భామ ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉండాలి అని భావిస్తోంది, అంతేకాదు ఇక్కడే సొంతంగా ఓ ఇల్లు తీసుకోవాలి అని చూస్తోందట.. ఇప్పటికే ఓ అందమైన ఇంటికోసం ఆమె వెతుకుతోందట. ఇక్కడే సెటిల్ అవ్వాలి అని చూస్తోందట ఈ అందాత తార మోనాల్.