రీల్ లైఫ్ లో విలన్ కాని రియల్ లైఫ్ లో మాత్రం అతను ఓ హీరో ఆయనే సోనూ సూద్.. ఈ లాక్ డౌన్ సమయంలో చాలా మందికి సాయం చేశారు… వలస కార్మికులని తమ సొంత ప్రాంతాలకు పంపించారు.. చదువుకునే వారికి సాయం చేశారు..చాలా మందికి ఆపరేషన్లు చేయించారు, రైతులకి సాయం చేశారు.. విద్యార్దులకి ఫీజులు కట్టారు ఇలా సాయం అడిగిన ప్రతీ ఒక్కరికి ఆయన సాయం చేశారు.
అయితే ఆయన ఇక సినిమాల్లో విలన్ గా వద్దు హీరోగా నటించాలి అని అందరూ కోరుతున్నారు, ఇక తాజాగా ఆయన ఆచార్య సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.. ఇటీవల ఈ షూటింగ్ షెడ్యూల్ కు వచ్చారు, ఈ సమయంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయన చేస్తున్న సేవలను అభినందించారు.
తాజాగా ఆయన ఆచార్య సెట్ లో పని చేస్తున్న యూనిట్ లో కార్మికులకు ఉచితంగా సెల్ ఫోన్లు అందజేశారు. ఆర్థికంగా వెనుకబడిన కార్మికులను గుర్తించి 100 సెల్ ఫోన్లు కానుకగా బహూకరించారు.సోనుసూద్ చేసిన సాయానికి వారు అందరూ చాలా సంతోషించారు.