కొన్ని కొన్ని సంఘటనలు చాలా విచిత్రంగా ఉంటాయి… ఇది కూడా ఇలాంటిదే అని చెప్పాలి..పంజాబ్లోని డేరా బస్సిలో ఓ భర్తకు దొంగలు షాక్ ఇచ్చారు…భర్త భార్య కలిసి పిల్లల స్కూల్ ఫీజు కట్టేందుకు స్కూల్ కి వచ్చారు , ఈలోపు భార్యని కారులో ఉండమన్నాడు , అయితే దొంగలు ఈ సమయంలో కారుని ఎత్తుకెళ్లారు.
రాజీవ్ చంద్, రీతు దంపతులు తమ పిల్లల స్కూలు ఫీజు చెల్లించడానికి స్కూలు దగ్గరకు వచ్చారు.
ఇక కారు తాళాలు వేయకుండా అతను లోపలికి వెళ్లాడు భార్య కారులో ఉండిపోయింది.. కొంత మంది వచ్చి కారులోకి ఎక్కారు.
ఆమె గట్టిగా అరవబోయింది కాని ఆమె నోరు నొక్కేశాడు ఒకరు… మరో వ్యక్తి కారుని ముందుకు నడిపాడు, ఓ ఐదు కీలోమీటర్లు ముందుకు వెళ్లారు ఆమెని రోడ్డుపై వదిలేసి కారుతో పారిపోయారు..
వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. భార్యక్షేమంగా ఇంటికి వచ్చింది, అయితే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణచ చేస్తున్నారు.