బంగారం కొనాలి అని చూస్తే ఇది మంచి సమయం అని చెప్పాలి.. భారీగా బంగారం ధర తగ్గింది.. ఒక్కరోజే ఇలా తగ్గడం కొత్త ఏడాది ఇది తొలిరోజు అనే చెప్పాలి.. ముంబై బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి.. వెండి ధర కూడా భారీగా తగ్గింది.. మరి బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం.
హైదరాబాద్ మార్కెట్లో సోమవారం బంగారం ధర భారీగా తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.1200 తగ్గింది. రూ.46,300కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1300 తగ్గింది. రూ.50,500కు ట్రేడ్ అవుతోంది.
బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో తగ్గింది. వెండి ఏకంగా రూ.5500 తగ్గింది. దీంతో వెండి ధర రూ.69,000కి తగ్గింది. వచ్చే రోజల్లో బంగారం వెండి మరింత తగ్గుతుంది అంటున్నారు బంగారు వ్యాపారులు.