క్యాబేజీ చాలా మంది తినడానికి అంత ఇంట్రస్ట్ చూపించరు… ఎందుకు అంటే దీనిపై చిన్న చిన్న పురుగులు ఉంటాయి అని..ఆ పురుగు భయంతోనే చాలా మంది క్యాబేజీ కొనేందుకూ తినేందుకు సంకోచిస్తారు, ఎందుకు అంటే ఇది వారి మెదడుకు చేరుతుంది అని భయపడతారు.
క్యాబేజీ, కాలిఫ్లవర్… ఇవి రెండూ ఒకే రకమైన జాతి మొక్కల నుంచి వస్తాయి. క్యాబేజీ ఆకులపై టేప్వార్మ్ అనే పురుగు ఉంటుంది. ఇది చూడటానికి చిన్న పురుగు కాని చాలా డేంజర్.. ఇది సరిగ్గా వండకపోయినా పచ్చిగా తిన్నా ఆ ఆకులపై ఉన్న టేప్ వార్మ్ మీ శరీరంలోకి వెళుతుంది.. అక్కడ నుంచి పేగుల్లోకి చేరుతుంది అలా రక్తంలో కలిసి తర్వాత అది మెదడుకి చేరుతుంది.
అందుకే చాలా మంది వీటిని తినడానికి ఇంట్రస్ట్ చూపించరు…పశువుల వ్యర్థాల నుంచి ఈ పురుగు భూమిపైకి వస్తుంది. ఇది క్యాబేజీ క్యాలిఫ్లవర్ తింటూ పెరుగుతుంది. అందుకే వేడి నీటిలో క్యాబేజీ క్యాలిఫ్లవర్ రెండు మూడు సార్లు కడిగి అప్పుడు బాగా వేడి వేడిగా వండాలి.